25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మున్నూరు కాపు సంఘం మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ కు సంబంధం లేదు

Must read

📰 Generate e-Paper Clip

  • మున్నూరు కాపు సంఘం నందు అధికారికంగా ఏ కార్యక్రమం నిర్వహించలేదు
  • మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హాజీ బాల్రాజ్

 

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు హాజీ బాల్రాజ్ మాట్లాడుతూ గురువారం రోజున పలు దినపత్రికలలో మున్నూరు కాపు సంఘం సమావేశంలో ప్రోటోకాల్ రగడ అంటూ వచ్చిన వార్తలపై స్పందించారు. మంగళవారం రోజున మున్నూరు కాపు సంఘం నందు జరిగిన సమావేశం పూర్తిస్థాయిలో మున్నూరు కాపు కులస్తుల అంతర్గత సమావేశమే తప్పితే ఎలాంటి రాజకీయ సమావేశం కాదని అందుకు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు అతిథులు కాదని అందరూ సమానమేనని ఆయన అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ శెట్కర్ ను మున్నూరు కాపు కుల సంఘ పెద్ద కాపులు అందరు కలిసి కమ్యూనిటీ అభివృద్ధి కొరకై కలవడం జరిగిందని వారి అభ్యర్థనను మన్నించిన ఎంపీ గౌరవప్రదంగా కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది తప్పితే ఇలాంటి రాజకీయ కార్యక్రమం నిర్వహించలేదని, వారు స్పష్టం చేశారు. గతంలో అధికారంలో ఉన్న నాయకులు అందరితో సత్సంబంధాలను కొనసాగిస్తూ వారి ద్వారా అభివృద్ధిని కోరుకున్నామే తప్పితే ఎలాంటి రాజకీయ కోణాలు లేవని ఇందులో ప్రోటోకాల్ ఎక్కడ ఉల్లంఘించలేదని అసలు ఇది రాజకీయ కార్యక్రమమే కానప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘన ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. మున్నూరు కాపు సంఘం సమావేశం లో మొదటి వరుసలో కూర్చుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్లే ప్రెస్ మీట్ పెట్టి ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని స్వయంగా వారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మున్నూరు కాపు సంఘం సమావేశాన్ని రాజకీయం చేయడం పట్ల మున్నూరు కాపు కులస్తులు, పెద్ద కాపులు, సంఘ సభ్యులు ఇట్టి విషయమై చింతిస్తున్నామని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుల్లెన్ విట్టల్ , అవర్ సాయిలు, పెర్శెట్టి పండరి, తములూరు గంగాధర్, పోకల సాయిలు,నారం నాగు, గడ్డం మారుతి, దర్పల్ అశోక్, ధర్పల్ విట్టల్, చింతల శ్రీనివాస్, అవార్, సురేష్, పోతుల అనిల్,మున్నూరు కాపు కులస్తులు, పెద్ద కాపులు, తదితరులు పాల్గొన్నారు.

Munnur Kapu Sangham meeting has nothing to do with Congress party protocol

More articles

Latest article