23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

డబుల్ బెడ్ రూమ్ అర్హులైన పేదలకు ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: అర్హులైన పేదలకు మోర్తాడ్ మండల కేంద్రంలో ఉన్న డబుల్ బెడ్ రూములు కేటాయించాలని ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మెమోరండం తాసిల్ ల్దార్ కృష్ణకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం మాట్లాడుతూ 1994లో ధోన్ పాల్ గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. కానీ అక్కడ ధనిక కుటుంబాలకు చెందిన వారు పేదలకు ఇవ్వకుండా అడ్డం పడుతున్నారని వారు తెలిపారు. అదే విధంగా కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు డబుల్ బెడ్ రూములు కేటాయించడం జరిగిందని సుమారు 200 పై చిలుకు ఇండ్ల నిర్మాణాలు జరిగితే కేవలం 160 మాత్రమే అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసి మిగతా వాటిని ఆపడంతో పేద ప్రజలకు ఇల్లు లేని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అని మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమవుతుందని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు  గడుస్తున్న నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూములు పంచకుండా నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని  కాబట్టి తక్షణమే మిగిలిన 65 ఇళ్లను అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షుడు సారా సురేష్, మోర్తాడ్ మండల కార్యదర్శి జి కిషన్, కమ్మర్ పల్లీ మండల కార్యదర్శి అశోక్, మాస్ లైన్ జిల్లా ప్రజాపంతా మాస్ లైన్ ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి జి. కిషన్, నాయకురాలు సత్యక్క, దయాల్ సింగ్, అరుణ, అంజలి, డాక్టర్ శ్రీనివాస్,రాముల్లమ్మ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.

Double bedrooms should be given to deserving poor people.

More articles

Latest article