23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 సర్వే గడువు పొడిగింపు

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను  రాష్ట్ర ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ విజన్ – 2047” అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తున్నదని, ఈ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. సర్వేలో పాల్గొనడానికి గడువును నవంబర్ 1, 2025 వరకు పొడిగించారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ఉద్యోగులు, ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంటరీని రూపొందించడంలో ప్రతి రాష్ట్ర పౌరుడు భాగస్వామ్యమై సిటిజన్ సర్వేలో పాల్గొని తెలంగాణాకు దిశను నిర్ణయించాలని అన్నారు. ఈ సర్వేలో పాల్గొనేందుకు http//www.telangana.gov.in/telanganarising/ అనే లింక్ ద్వారా భాగస్వాములు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.

More articles

Latest article