- లోగో ఆవిష్కరణ
నిజామాబాద్ , బతుకమ్మ : రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాలలో అభివృద్ధికి కృషి చేసిన సెక్యూరిటీ కౌన్సిల్ తరహలో నిజామాబాద్ లో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సోమవారం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సెక్యూరిటీ కార్యాలయం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ను పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
