27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

 ఆర్టీసీ బస్సు ఢీకొని మున్సిపల్ స్లీపర్ మృతి

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :  పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం మున్సిపాలిటీలో స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న భాగ్యం నాగమణిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నాగమణిని సహచర సిబ్బంది, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈఘటనతో బోధన్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.    ఈ ఘటనపై మున్సిపల్ సిబ్బంది, ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మృతురాలి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని, ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మవికాస్ మహతో హతో హామీ ఇచ్చారు.

Municipal sleeper dies after being hit by RTC bus

More articles

Latest article