ఆర్టీసీ బస్సు ఢీకొని మున్సిపల్ స్లీపర్ మృతి

బోధన్, బతుకమ్మ :  పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం మున్సిపాలిటీలో స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న భాగ్యం నాగమణిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన నాగమణిని సహచర సిబ్బంది, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈఘటనతో బోధన్ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.    ఈ ఘటనపై మున్సిపల్ సిబ్బంది, ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్...