- బాల సాహిత్యంలో రాణించడం అభినందనీయం
- ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్
భీమ్ గల్, బతుకమ్మ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీవాణి సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి బాల సాహిత్య, సాహిత్య సంపుటాల పోటీలల్లో 2025 సంవత్సరానికి గాను 10వ సంవత్సర పెందోట సాహిత్య పురస్కారానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి తొగర్ల సురేష్ ఎంపిక పట్ల ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తొగర్ల సురేష్ వృత్తిరీత్యా ముప్కాల్ మండల కేంద్రంలోని రక్షక బట నిలయంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) గా విధుల్ని నిర్వర్తిస్తున్నారని, ప్రవృత్తి సాహితీ సృజన. బాల సాహిత్యానికి సంబంధించిన పలు రచనలు కూడా చేశారన్నారు.”వెన్నెల్లో మా పల్లె” బాల సాహిత్యానికి చెందిన దీర్ఘ కవితను సిద్దిపేటకు చెందిన పెందోట బాల సాహిత్య పీఠము అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు ఈ ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో తొగర్ల సురేష్ మరెన్నో మంచి మంచి సాహితీ ప్రక్రియలో ప్రత్యేక దృష్టి కనబరచి ప్రతిభ చాటాలని అన్నారు. ఈ శుభ సందర్భంగా తొగర్ల సురేష్ కు కంకణాల రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.
