24.7 C
Hyderabad
Monday, August 3, 2026

అమరుల త్యాగాలపై విద్యార్థులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ ఎల్లారెడ్డి మండలంలోని టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ విద్యార్థులకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.  జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాల ప్రకారం ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గురువారం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం అంతా  191 మంది పోలీస్ ఆఫీసర్స్ శత్రువుల దాడిలో వీరమరణం పొందారని తెలిపారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, యూ.శేషరావు,  ప్రభాకర్, సాయిలు పాటల మాటల ద్వారా అవగాహనా కల్పించారు. సైబర్ నేరాలపై  టోల్ ఫ్రీ నం.1930పై  ఎల్లారెడ్డి షీ టీమ్స్ సభ్యులు శ్రీశైలం, సుప్రజ అవగాహన కల్పించారు. షి టీమ్స్ నెంబర్ 8712686094,  అత్యవసర సమయంలో డయల్ 100 కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్. శ్రీ.నాగేశ్వర్ రావు, సబ్బంది పాల్గొన్నారు.

Students' awareness about the sacrifices of martyrs

More articles

Latest article