30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మాతృ మరణాలను తగ్గించండి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమీక్ష కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎం సి హెచ్ సూపర్వైజర్లు ప్రతి గర్భిణీ స్త్రీ ని 12 వారాల లోపు నమోదు చేయడమే కాకుండా నాలుగు సార్లు వైద్యుల చేత పరీక్షించేలా చూడాలని తెలిపారు. ధనుర్వతము రాకుండా టీకాలు ఇప్పించాలని ఒకవేళ ఎవరైనా ప్రమాదకరమైన లక్షణాలున్నట్లయితే వారిని ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీని ఎత్తు, బరువు, బీపీ, హెచ్ హెచ్ బి,రక్తహీనత మొదలగు పరీక్షలతో పాటు హైపర్ టెన్షన్, ప్లేట్లెట్స్ పరీక్షలు నిర్వహించి నివారణ లో భాగంగా ముందస్తు ప్రణాళిక రచించాలని తెలియజేశారు. సాధారణ ప్రసవాలకై తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రమాదకరమైన లక్షణాల గర్భిణీ స్త్రీలను స్త్రీ వైద్య నిపుణులు ఉండే ఆసుపత్రులకు ప్రసవాలకై ప్రణాలిక రచించాలన్నారు. ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీలు ప్రసవానికి వెళుతున్నప్పుడు వారి వెంట తప్పకుండా వెళ్లాలని సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా వారికి తగు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మదర్ ఇన్ మదర్ అవుట్ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఫోన్ ద్వారా వారికి అందించే ఆరోగ్య సేవలను గుర్తించి నమోదు చేయాలని అన్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎల్ఎంపీని, ఈడీడీ లను కరెక్ట్ గా నమోదు చేయాలని అన్నారు. ఏ ఒక్క మాతృ మరణం జరగకుండా అన్ని విధాల కృషి చేయాలని, అనివార్య కారణాలవల్ల ఎక్కడైనా మాతృ మరణం సంభవిస్తే పూర్తి సమాచారాన్ని అంటే గర్భిణీ స్త్రీ ఇంటి నుండి బయలుదేరి ఎక్కడెక్కడ ఏ రకమైన చికిత్స తీసుకున్నది ఏ లక్షణాల కొరకై ఉన్నత ఆసుపత్రులకు రిపేర్ చేయబడ్డది డాక్యుమెంటేషన్ వివరాలను సేకరించాలని తెలిపారు. ఆసుపత్రి స్థాయిలో ఆడిట్ ను, సామాజిక స్థాయిలో ఆడిట్ ను నిర్వహించి మాతృ మరణాలు నమోదు ఫార్మాట్ నందు పూర్తి సమాచారాన్ని పొందుపరచాలని కోరారు. గర్భిణీ స్త్రీ ఇంటి వద్ద కుటుంబ సభ్యుల ద్వారా గాని లేదా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల గాని ఏ ఒక్క మాతృ మరణం జరగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సమీక్షలో మాతృ మరణాలు జరిగిన  నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేగాo, భీంగల్, ఇందల్వాయి జక్రాన్ పల్లి,రెండు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అర్సపల్లి దుబ్బ నుండి సిబ్బంది పాల్గొనగా మాతా శిశు ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్వేత, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ కీర్తి డాక్టర్ అశ్విని ఏవో రాజేశ్వర్, డిపిహెచ్ఎన్ఓ స్వామి సులోచన, డి.హెచ్.ఇ వెంకటేశ్వర్లు ఎల్డి కంప్యూటర్ అనురాధ, వివిధ పీహెచ్సీల నుండి  వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి లు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు  పాల్గొన్నారు.

Reduce maternal mortality

More articles

Latest article