మాతృ మరణాలను తగ్గించండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతృ మరణాలపై సమీక్ష కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఎం సి హెచ్ సూపర్వైజర్లు ప్రతి గర్భిణీ స్త్రీ ని 12 వారాల లోపు నమోదు చేయడమే కాకుండా నాలుగు సార్లు వైద్యుల చేత పరీక్షించేలా చూడాలని తెలిపారు. ధనుర్వతము రాకుండా టీకాలు ఇప్పించాలని ఒకవేళ ఎవరైనా ప్రమాదకరమైన లక్షణాలున్నట్లయితే వారిని ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక శ్రద్ధ...