హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సాయంత్రం 5గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ రావాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణా శాఖ చెక్ పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని రవాణా శాఖ చెక్ పోస్టును రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజులు ఆలస్యంగా జీవో రాజీ అయ్యింది. ఉత్తర్వులు వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా చెక్ పోస్టులను ఇంకా తొలగించలేదు. ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు నెలల క్రితం జీవో జారీ అయినా అవినీతి అధికారుల తీరు మారలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులు రద్దు చేయాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
