27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బీటీ రోడ్లకు నిధులు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆరు గ్రామాలకు హమ్ ఫేస్ వన్ కింద బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య  మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆరు గ్రామాలకు 22 కోట్లు,వీర్నపల్లి మండలంలోని ఆరు గ్రామాలకు 22 కోట్లు,గంభీరావుపేట మండలంలోని ఆరు గ్రామాలకు 24 కోట్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట నుండి కోరుట్లపేట బీటీ రోడ్డు వరకు నారాయణపూర్ నుండి రాగట్లపల్లి వరకు నారాయణపూర్ నుండి వయా కొండాపూర్ రోడ్డు వరకు పదిర రాయపల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం, గుండారం నుండి తిమ్మాపూర్ వరకు పోతిరెడ్డిపల్లి నుంచి ధర్మారం వరకు బీటీ రోడ్ల మరమ్మత్తులకు ఈ నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులను మంజూరు చేసిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్,చెన్ని బాబు,చెరుకు ఎల్లయ్య,వెంకటేష్ మూర్తి,గంట బుచ్చయ్య గౌడ్, మెండే శ్రీనివాస్,రామ్ సింగ్,పందిర్ల శ్రీనివాస్ గౌడ్,రాజు నాయక్,  గొల్లపల్లి మల్లేశం,ఇలియాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article