27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

‘నా చావుకు కేటీఆరే కారణం’

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఆశా ప్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను వేధిస్తోందని, తన మరణానికి పీజేఎంఆర్, హెచ్‌ఎస్, కేటీఆర్ కారణమని ఆరోపించారు. వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వాట్సాప్ సెల్ఫ్ చాట్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కేటీఆర్‌ను ఉద్దేశించి, “పార్టీ మహిళలతో నీకు సంబంధం ఉందని నాకు చెప్పారు. సాక్ష్యాలు బయటపెట్టాలా?” అని ట్వీట్ చేశారు.  అలాగే గతంలో  ఆశా ప్రియ రాజకీయం కోసం ఏ గడ్డి అయినా కేటీఆర్ తింటాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.  తనపై నీచంగా పోస్టు వేసిన వ్యక్తితో ఫోటో దిగడంపై  ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

 'KTR is the reason for my death'

More articles

Latest article