27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

 తెలంగాణలో ఆరు ఆర్టీఏ చెక్ పోస్టుల పై ఎసిబీ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి జిల్లాలో రెండు చెక్ పోస్టులలో తనిఖీలు

. . . లెక్కలలో లేని నగదు రూ.87 వేలు స్వాధీనం

 

 బిక్నూర్ /మద్నూర్, బతుకమ్మ:

తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ రవాణా శాఖ చెక్ పోస్టులపై దాడులు నిర్వహించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేసింది. అవగాహన కోసం  ఉన్న చెక్ పోస్టులలో యధావిదిగా తనిఖీలు నిర్వహిస్తు డబ్బులు వసూలు చేస్తున్న ట్టు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ  శనివారం రాత్రి నుంచి అదివారం తెల్లవారు జామున వరకు సోదాలు చేపట్టింది… మహబూబ్ నగర్ జిల్లాలోని క్రిష్ణ చెక్ పోస్ట్, సంగారెడ్డిలోని జహిరాబాద్ చెక్ పోస్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, కోమరం భీం జిల్లా వాంకిడి చెక్ పోస్టులతో పాటు కామారెడ్డి జిల్లా పొందుర్తి, సలాబత్ పూర్ చెక్ పోస్టులలో తనిఖీలు చెపట్టింది……

ACB raids six RTA check posts in Telangana

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి నుంచి రికార్డులను పరిశీలించి లారీల వద్ద నుంచి చెక్ పోస్ట్ అధికారులు, సిబ్బంది అక్రమంగా వసూలు చేసిన రూ. 36 వేల  నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నామని ఆయన చెప్పారు. లారీల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే ఎడాది జూన్ 26న ఇదే చెక్ పోస్ట్ పై అప్పట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లారీల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ. 92 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ACB raids six RTA check posts in Telangana

 

కామారెడ్డి జిల్లాలో జంగంపల్లి ఆర్టీవో చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వాహనదారుల నుంచి ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఆర్టీవో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని సమాచారంతో ఆదివారం ఒక్కసారిగా చెక్ పోస్ట్ లో ఎటాక్ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీవో కార్యాలయం ఏజెంట్ వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు రూ. 46, 300 డ్యూటీలో ఉన్న ఏ ఎమ్ విఐ అఫ్రూద్దీన్ నుంచి రూ. 5,000 రూపాయలు మొత్తం 51300 స్వాధీన పరచుకొని డబ్బు సీజ్ చేశారు. ఈ సోదాలు అర్ధరాత్రి ఒకటి నుంచి ఉదయం 6:30 వరకు సోదాలు జరిగినట్లు సమాచారం మిగతా ఉద్యోగుల వద్ద తనిఖీలు చేసినప్పటికీ డబ్బులు మాత్రం దొరకలేదని సమాచారం. అవినీతికి పాల్పడుతున్న అధికారులను పట్టుకోవడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం ఏసీబీ అధికారులు అన్నారు. నాలుగు నెలలు గడవక ముందే తిరిగి అదే చెక్ పోస్ట్ పై ఏసీబీ పంజా విసరడం గమనార్హం

More articles

Latest article