29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

బీసీ సంఘాల బంద్ కు బీజేపీ మద్దతు

Must read

📰 Generate e-Paper Clip

  • మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ : బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ మేరకు అఖిల పక్షం, బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు బీజేపీ పార్టీ పూర్తి మద్దత్తునిస్తున్నట్లు మండల పార్టీ ప్రెసిడెంట్ అరే రవీందర్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం పట్టణ కేంద్రంలో బంద్ కార్యక్రమం లో పాల్గొని వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలను మూసి వేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ లో బీసీలకు 42%:రిజర్వేషన్ కోసం బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య మండల ప్రధాన కార్యదర్శి రామ కృష్ణ యువమోర్చా అధ్యక్షులు శెట్టి ప్రేమ్చంద్, అజయ్ సీనియర్ నాయకులు సంధ్య రాజ్,నీలం గంగాధర్, ఉప్పల నవీన్, హరిప్రసాద్, దయ ప్రవీణ్ నరేందర్ గౌడ్,అశోక్,శ్రీనివాస్, తోపారం సురేందర్,ప్రశాంత్, శ్రీనివాస్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article