28.8 C
Hyderabad
Monday, August 3, 2026

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద దహనం చేశారు.  ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు వ్యతిరేకించలేదని, మిగతా కులాలు కూడా బీసీ రిజర్వేషన్లు బలపరచాలని కోరారు.  అన్ని పార్టీలు మద్దతిచ్చినా రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడం అన్యాయమన్నారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అనేక ప్రజావ్యతిరేక బిల్లులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా, చట్టాలు చేస్తున్న మోడీ ప్రభుత్వం, బీసీ బిల్లును ఎందుకు చట్టబద్ధం చేయడం లేదని ఆగ్రహించారు.  రాష్ట్రంలోని 56% పైగా బీసీ జనాభాకు 42 శాతం రిజర్వేషన్లు కూడా దక్కకుండా చేయాలని ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.   బీసీలకు రిజర్వేషన్ల పెంపు అమలయ్యే వరకు పోరాడుతామన్నారు.   ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా నాయకులు కిషన్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.గోదావరి, కే.సంధ్యారాణి, పీ.డీ.ఎస్.యు జిల్లా కార్యదర్శి కే గణేష్, టియుసిఐ జిల్లా నాయకులు విటల్, లింగం, గంగాధర్, నాయకులు సునంద, నర్సక్క, మహిపాల్, అమూల్య, రమేష్, నారాయణ, మహేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article