కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు వ్యతిరేకించలేదని, మిగతా కులాలు కూడా బీసీ రిజర్వేషన్లు బలపరచాలని...