- పోరాటాలకు నెలవు పీడీఎస్ యు
- సీపీఐ (ఎం. ఎల్ల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి.రామకృష్ణ
భీంగల్, బతుకమ్మ : పిడిఎస్ యూ చరిత్రంతా పోరాటాల మయమేనని,విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో పిడిఎస్ యూ నే నెంబర్ వన్ అని కీలక సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, మాజీ పీడీఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పి. రామకృష్ణ ఉద్గాటించారు. పీడీఎస్ యు ఏర్పడి 50యేండ్లు అవుతున్న సందర్భంగా భీంగల్ మండలంలోని దేవక్కపేటలో పి డి ఎస్ యు పూర్వ విద్యార్థులు, ప్రస్తుత పీడీఎస్ యు నాయకత్వంలో పీడీఎస్ యు పూర్వవిద్యార్థుల సభ నిర్వహించగా అట్టి సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులను సామాజికంగా, రాజకీయంగా పురోభివృద్ధి వైపు నడిపించింది పీడీఎస్ యు నేనన్నారు. దోపిడీ వర్గానికి సహాయపడుతూ కులం మతం , స్త్రీ,పురుష అసమానతలను నిరంతరం కాపాడుతున్న విద్యా వ్యవస్థ అశాస్త్రీయమైనదని దీనిని వ్యతిరేకిస్తూ, శ్రామిక వర్గానికి ఉపయోగపడే సైన్సును ముందుకు తీసుకెళ్లే శాస్త్రీయ విద్యా విధానం కావాలని పోరాడుతున్నదని అన్నారు. ప్రతి అంశాల్లో విద్యార్థి ప్రశ్నించాలని ప్రతి వ్యక్తి ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నించే చైతన్యాన్ని విద్యార్థులకు పీడీఎస్ యు యే నేర్పిందని అన్నారు. ప్రజలను అనేక రకాలుగా మోసగించిన రాజకీయాలను పసిగడుతుందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జరిగిన ఉద్యమంలో ముందుండి పోరాడి పీడీఎస్ యు నాయకులు జైలుకు వెళ్లారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, పెంచాలని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని, బస్సుల సంఖ్యను పెంచాలని, పాలిటెక్నిక్ వృత్తి విద్య సులభతరం ఉండాలని, పెరుగుతున్న ఫీజులు తగ్గించాలని కొట్లాడింది పీడీఎస్ యు యేనన్నారు.ఎల్కేజీ నుండి యూనివర్సిటీ విద్య వరకు అనేక రకాల విద్యార్థి సమస్యలపై రాజిలేని పోరాటాలు నిర్వహించిందని అన్నారు. డబ్బులు ఉన్నవారికి ఒక విద్య లేని వారికి ఇంకో విద్య కాకుండా అందరికీ ఒకే విద్యా విధానం ఉండాలని కొట్లాడుతుందని అన్నారు. ఆ క్రమంలోనే పిడిఎస్ యూ నాయకులు జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, చేరాలు, కోల శంకర్, శ్రీపాద శ్రీహరి అమరులయ్యారని అన్నారు. వీరి బాటలో పీడీఎస్ యు నిరంతరం ప్రయాణిస్తుందని, నేటి ప్రతి విద్యార్థి పీడీఎస్ యు లో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె. రాజేశ్వర్,ఆర్.దామోదర్ లు,మండల నాయకులు ఎం. డీ అనిస్, ఎం.శ్రవణ్,జి .రవి,ఏ. సాయిలు,బి.రవి, పీడీఎస్ యు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

