27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పీడీఎస్ బియ్యం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలోని మామిడి పల్లి గ్రామ శివారులో గల వైభవ్ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై దాడి చేసి 385 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు మాక్లూర్ ఎస్ఐ తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో దాడి చేసి టీఎస్ 16యూసీ 6920 ఐచర్ వాహనంలో 127క్వింటాళ్లు, రైస్ మిల్లులో 257 క్వింటాళ్ల వరకు ప్రజాపంపిణీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.11,55,600 ఉంటుందని తెలిపారు. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి అమ్రాద్ గ్రామంలో గల రాజరాజేవ్వర స్వామి రైస్ మిల్లులో భద్ర పరచినట్లు తెలిపారు. బియ్యం తరలిస్తున్న ఐచర్ వ్యాన్ డ్రైవర్ మమ్మద్ సోహెల్, ఐచర్ వాహనం యజమాని, బియ్యం కి సంబందించిన వ్యక్తులు ఐయిన మదనం ఎల్లయ్య, అక్రమంగా నిల్వచేసిన రైస్ మిల్ వైభవ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీ యజమాని నల్లమోతు నగేష్, మిల్లు ఆపరేటర్  బాలాజీ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

PDS rice seizure

More articles

Latest article