మాచారెడ్డి, బతుకమ్మ: ఈనెల 28న కామారెడ్డి జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఖో ఖో మీట్ కు మండలంలోని సోమార్ పేట ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న మధు రిత్విక (అండర్ – 17), ఏడవ తరగతి చదువుతున్న గీతాంజలి (అండర్ – 14) విభాగంలో ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులను గురువారం పాఠశాలలో అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుర భాస్కర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పోశెట్టి, స్వరూపారాణి, వ్యాయామ ఉపాధ్యాయురాలు సంధ్య పాల్గొన్నారు.
