- పేకాట స్థావరం పై పోలీసుల దాడులు
- పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటాం
- రుద్రూర్ ఎస్సై సాయన్న
రుద్రూర్, బతుకమ్మ : “అక్బర్ నగర్ గుట్టల్లో పత్తాలాట.. చేతులు మారుతున్న లక్షల రూపాయలు”.. అనే శీర్షికపై సోమవారం బతుకమ్మ దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి రుద్రూర్ ఎస్సై సాయన్న స్పందించారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ శివారులోని గుట్ట ప్రాంతంలో బుధవారం రాత్రి పేకాట స్థావరం పై ఎస్సై సాయన్న తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ముగ్గురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1100 రూపాయలు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
