30.9 C
Hyderabad
Monday, August 3, 2026

అందరి ఆమోదం పొందిన నేతకు అధ్యక్షుడిగా అవకాశం అధిస్టానం కల్పిస్తుంది.

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్

 

నిజామాబాద్, బతుకమ్మ : అనేక మంది పోటీలో ఉన్నప్పటికీ అందరి ఆమోదం పొందిన నేతకు డీసీసీ అధ్యక్షుడి గా  అధిస్ఠానం అవకాశం కల్పిస్తుందని కర్నాటక ఎమ్మెల్యే,  ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ.. ఏఐసిసి ఆదేశాల మేరకు సంస్థాగత పార్టీ ఎన్నికల పరిశీలకులుగా రావడం జరిగిందన్నారు. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, తెలంగాణలో రెండోసారీ అధికారమే లక్ష్యంగా  పార్టీని పటిష్ఠం చేయడం కోసం ఏఐసీసీ కసరత్తు చేస్తుందని అన్నారు.  కాంగ్రెస్ సంఘటన్ పటిష్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేయడం, స్థానిక నేతలు, ముఖ్య కార్యకర్తలు, స్థానికుల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ అందరి అభిప్రాయాలు సేకరించి కేంద్ర అధిష్టానానికి అందజేస్తాం అని తెలిపారు.  5 ఏళ్ల కనీస అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరితో కలిసి మాట్లాడాను. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అభిప్రాయాలు తీసుకుంటాను అని తెలిపారు. కాంగ్రెస్ కేవలం రాజకీయ పార్టీ కాదు. సామాజిక బాధ్యత కలిగిన సంస్థ అది అందరు కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి పనిచేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఐదేళ్లలో ప్రతి ఒకటి పూర్తి చేస్తాము అన్నారు. డిసీసీ, సిటి కాంగ్రెస్ పధవులను ఖచ్చితంగా పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని దానికోసం ఎఐసీసీ భారీ స్థాయిలో కసరత్తు చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు పార్టి పధవులకు ఇ స్థాయిలో ఎంపిక జరుగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టికి సంబంధించిన మంత్రులైనా , కార్యకర్తలైనా పార్టీకి అందరు సామానమేనని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి సుధర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వేంకట్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికేల నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరేపల్లి మోహన్, ఎనుగు రవింధర్ రెడ్డి, డిసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్ధు ఆకాడమీ చైర్మెన్ తాహేర్ బిన్ హందాన్, రైతు వ్యవసాయ కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్, నుడా చైర్మెన్ కేశవేణు, నాయకులు నరాల రత్నాకర్ తదితరులు, డిసీసీ, సీసీసీ అశవాహులు పాల్గోన్నారు.

More articles

Latest article