అందరి ఆమోదం పొందిన నేతకు అధ్యక్షుడిగా అవకాశం అధిస్టానం కల్పిస్తుంది.
ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ నిజామాబాద్, బతుకమ్మ : అనేక మంది పోటీలో ఉన్నప్పటికీ అందరి ఆమోదం పొందిన నేతకు డీసీసీ అధ్యక్షుడి గా అధిస్ఠానం అవకాశం కల్పిస్తుందని కర్నాటక ఎమ్మెల్యే, ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ అర్షద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ.. ఏఐసిసి ఆదేశాల మేరకు సంస్థాగత పార్టీ ఎన్నికల పరిశీలకులుగా రావడం జరిగిందన్నారు. కేంద్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, తెలంగాణలో రెండోసారీ అధికారమే లక్ష్యంగా పార్టీని పటిష్ఠం...