27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఛలో కామారెడ్డికి తరలి రావాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : భారత దేశ న్యాయమూర్తి బిఆర్ రామకృష్ణ గవాయి పైన ఢిల్లీలో దాడికి నిరసనగా కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు సోమవారం నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కంటి పద్మారావు మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రామగళ్ళ శివ నంద మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.  ప్రతి గ్రామం, మండలం, నాలుగు నియోజకవర్గాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

More articles

Latest article