26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కోటగల్లీ మాల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని కోటగల్లీ  మాల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు.   సంఘానికి చెందిన 70 మంది సభ్యులు బోనాలు ఎత్తి అమ్మవారి మందిరాలకు వెళ్లారు.  ముందుగా మాల సంఘం నుంచి పెద్ద బజారులోని పోతలింగయ్య గుడికి… తర్వాత మైసమ్మ గుడికి.. అలాగే మాల సంఘం బోరు వద్ద … తర్వాత బోనాల వద్ద మేకలు కోసి చివరిగా పోచమ్మ గల్లీలో గల పోచమ్మ గుడికి బోనాలు ఊరేగించి అక్కడ మేకను బలి ఇచ్చారు.  ఈ సందర్భంగా మాల సంఘం గౌరవ అధ్యక్షులు సక్కి సతీష్ మాట్లాడుతూ సమాజంలోని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ బోనాల పండుగ నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కోట గల్లి మాల సంఘం ముఖ్య సలహాదారులు సుంకరి లక్ష్మీనారాయణ.. చెక్క సాగర్, సాదు నారాయణ , అధ్యక్షులు సక్కి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బేగరీ రాములు, నాయకులు నల్ల రాజారావు, నల్ల ప్రసాద్, ఆసాది రాజలింగం.. సుంకరి అబ్బయ్య, తాటి పోచయ్య పుట్ట బాలయ్య, సక్కి శ్రావణ్, సుంకరి పృథ్వి, సాధు సచిన్, జిట్టా సన్నీ, సాధు రాజేష్, సక్కి రఘు, సక్కి సంపత్, సక్కి వేణు, సాధు వినోద్, సాదు లవన్, సాదు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article