28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జస్టిస్ గవాయిపై దాడి అంటే రాజ్యాంగంపై దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జస్టిస్ గవాయి పై జరిగిన దాడికి నిరసనగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి బి.సుజాత ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడి జస్టిస్ గవాయి పై జరిగింది కాదని, మానవ హక్కులు భారత రాజ్యాంగంపై జరిగిన దాడి అని అన్నారు. మన భారతదేశం భారత రాజ్యాంగంపై ఆధారపడి నడుస్తుందని, భారత రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానం నడుస్తుందని తెలి4పారు.  న్యాయవ్యవస్థకే అన్యాయం జరిగితే అవమానాలు జరుగుతే ఇక మిగతా డిపార్ట్మెంట్స్ కి సామాన్య ప్రజలకి ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించవచ్చు అన్నారు  నిజంగా మనువాద సిద్ధాంతకర్తలకు  దేవుడి పైన అంత ప్రేమ ఉంటే  విష్ణుమూర్తి తలను  వారే ఏర్పాటు చేసుకుని గుడిని మళ్ళీ పునర్దించుకొని పూజించుకుంటే సరిపోయేది కదా అని అన్నారు.  దేవుడికి మనిషి సహాయం చేయడం ఏంటీ  మనిషిని దేవుడు నడిపిస్తాడు కదా జస్టిస్ అన్న దాంట్లో తప్పేముంది ఎందుకు అంతగా అవమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రశ్నించారు. గత 11 సంవత్సరాలుగా మానవ హక్కుల్ని కాలరాస్తూ అన్యాయాలు అవమానాలకు అడ్డగా భారతదేశం మారుతుందని అందులో ముఖ్యంగా దళితులపై దాడులు,

Attack on Justice Gavai is an attack on the Constitution.

హిందూ, ముస్లిం గొడవలు, కుల దురాంకార హత్యలు మనువాద సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి నాయకత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  నిజంగా దేశం పైన కేంద్ర ప్రభుత్వానికి అంత ప్రేమ ఉంటే దేశ ప్రజల మీద ముఖ్యంగా 80% ఉన్న హిందువుల మీద ప్రేమ ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగం ఇయ్యాలని డిమాండ్ చేశారు. గుడులకు బదులుగా బడులు నిర్మించండి మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలు దాడులు హింస అరికట్టాలని తెలిపారు.  నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించి నిరుపేదలకు చేతినిండా పని కల్పించాలన్నారు. ఇవన్నీ  ప్రజలకు అందించిన తర్వాత మీ దేశభక్తిని చాటుకోండి అని మహిళా సంఘాలు ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, సునంద, నరసమ్మ, మైపాల్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి స్వరూప రాణి, అంజలి, ఐద్వా, జిల్లా కమిటీ సభ్యులు కవిత, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గంగాధర్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజు తదితరులు పాల్గొన్నారు.

Attack on Justice Gavai is an attack on the Constitution.

More articles

Latest article