జస్టిస్ గవాయిపై దాడి అంటే రాజ్యాంగంపై దాడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జస్టిస్ గవాయి పై జరిగిన దాడికి నిరసనగా ఐద్వా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి బి.సుజాత ఆధ్వర్యంలో మహిళా సంఘాలు ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఈ దాడి జస్టిస్ గవాయి పై జరిగింది కాదని, మానవ హక్కులు భారత రాజ్యాంగంపై జరిగిన దాడి అని అన్నారు. మన భారతదేశం భారత రాజ్యాంగంపై ఆధారపడి నడుస్తుందని, భారత రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానం నడుస్తుందని తెలి4పారు. న్యాయవ్యవస్థకే అన్యాయం జరిగితే అవమానాలు...