28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బోనస్ బోగస్ అని నిరూపిస్తే డబ్బులు చెల్లించేందుకు సిద్ధం

Must read

📰 Generate e-Paper Clip

  • జడ్పీటీసీకి సపోర్ట్ చెయ్యనని తెలపడంతో బురదజల్లే ప్రయత్నం
  • మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్

 

బతుకమ్మ, కోటగిరి : రానున్న జడ్పిటిసి ఎన్నికలలో తనకు సపోర్ట్ చేయనని తెలపడంతో తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి శంకర్ పటేల్ మాట్లాడుతూ… నిజంగా తాను బోగస్ బోనస్ తీసుకున్నట్లు కానీ ఎవరికైనా కౌలు కి ఇచ్చినట్లు నిరూపిస్తే  డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. ఉమ్మడి కుటుంబంలో 35 ఎకరాల  వ్యవసాయం భూమి తమ కుటుంబీకుల పేర్ల మీద ఉందని  ఆయన తెలిపారు. రానున్న జడ్పిటిసి ఎన్నికలలో  తనకు సపోర్ట్ చేయాలని సదరు బిఆర్ఎస్ నాయకుడు అడిగినప్పుడు సపోర్ట్ చేయనని తెలిపినందుకే  నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని  ఆయన అన్నారు.  తమ కుటుంబంలో నలుగురు పేర్లు మీద నాలుగున్నర లక్షల బోనస్ డబ్బులు రావడం వాస్తవమేనని ఆయన అన్నారు. కానీ బిఆర్ఎస్ నాయకుడు ఇంట్లో ఒకే వ్యక్తి పై 3,70,000 రూపాయలు బోనస్ ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మీపై మూడు కేసులు ఉన్న మేము ఏనాడు వేలెత్తి చూపించలేదనీ   కనీస సౌకర్యాలు లేకుండా ఉన్న స్కూల్ పైన ఒక తాజా మాజీ జెడ్పిటిసిగా నేను డిఈఓ,ఎడ్యుకేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాననీ ఆయన అన్నారు..ఎస్సీలకు చెందిన అసైన్మెంట్ భూములను ఇల్లీగల్గా పట్టా చేసుకున్న వైస్ ఎంపీపీ  మహా నాయకుడు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.ఒక ఐటీ రిటర్న్స్ చేసే వ్యక్తి ఏవిధంగా  వారి కుటుంబ సభ్యులపైన అసైన్మెంట్ భూములను పట్టా చేసుకుంటారని  ఆగ్రహం వ్యక్తం చేశారు..దీనిపై ప్రజాభిప్రాయం మేరకు కలెక్టర్ కు కంప్లైంట్ చేసి విచారణ చేయాలని కోరతాననీ అన్నారు.ఈ సందర్భంగా ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ.విచారణ అధికారులు అలాగే తాజా మాజీ జెడ్పిటిసి పైన బిఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలు సరైనవి కావని.వారియొక్క ప్రెస్ మీట్ వారి స్వార్థ రాజకీయాల కొరకై పెట్టుకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.కలెక్టర్ ఆదేశాల మేరకు బోనస్ విషయంపై నిష్పక్షపాతంగా విచారిస్తున్న రియాజుద్దీన్ అంబర్ సింగ్ అనే అధికారులుపై అవినీతి ఆరోపణలతో విమర్శలు చేయడం తగదన్నారు.బోనస్ ఎంక్వయిరీ ప్రస్తుతం కొనసాగుతున్న త్వరణంలో వాస్తవాలు ఎప్పటికైనా తప్పు జరిగితే బయటకు వస్తాయి.ఎవరైనా బోనస్ విషయంలో పొరపాట్లు చేస్తే దానికి తగిన ఫలితం అనుభవించాల్సిందే నని అన్నారు.ఎలక్షన్ సందర్భంగా ఎదుటి వారిపై బురద చల్లే వాక్యాలను ఇకనైనా మానుకోవాలని.రాజకీయాలలో రాజకీయం చేయాలనుకున్నవారు ఫేస్ టు ఫేస్ గా ప్రజా క్షేత్రంలో పోటీపడి ప్రజల మన్ననలను పొందాలే తప్ప ఇలాంటి బురద చల్లే రాజకీయాలు చేయొద్ద ఆయన హితవు పలీకారు.ఒకప్పుడు కోటగిరి మండలం అంటే అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేదని.నిష్పక్షపాతంగా పని చేసే అధికారుల పైన ఆరోపణలు చేయడం వల్ల మండలం పేరు చెడిపోతుందని అన్నారు.మేమందరం మా ఆదర్శ నాయకుడైన పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో నడిచే నాయకులమని అన్నారు.ఈ ప్రెస్మీట్లో ఉమ్మడి కోటగిరి మం డల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,శంకర్ పటేల్ అభిమానులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article