29.3 C
Hyderabad

ఎస్సారెస్పీ 21 గేట్లని ఎత్తి నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 21 గేట్లు ఎత్తి గోదావరిలోకి 65,604 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి రవి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టు లోకి 75,394క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మీ కాల్వ ద్వారా 200 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.అడుగులు, 80.053 టిఎంసిలు కాగా శుక్రవారం ప్రాజెక్టులో 1090.80 అడుగులు, 79.658 టీఎంసీలు నీరు ఉంది.

More articles

Latest article