25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆశలు ఆవిరయ్యాయి..

Must read

📰 Generate e-Paper Clip

  • అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి..

 

మోర్తాడ్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడడంతో ఆశావహుల ఆశలు  ఆవిరి అయ్యాయి అని తెలుపడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన గంటల వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఆలు లేదు సులు లేదు అల్లుడి పేరు సోమ లింగం అన్నట్టు గడిచిన పది రోజులు గ్రామాల్లో తిరుగుతూ నేనే రాజును నేనే మంత్రిని నేనే సర్పంచిని అంటూ వారం పదిరోజులుగా ఆశావాహులు అడవిడి చేశారని తేలుపడంలో సందేహం లేదు. అకాల వర్షం వచ్చి చేతికి వచ్చిన రైతుల పంటను తడిపేసి ఆశలను చిదిమేసినట్లు గురువారం హైకోర్టు ఎన్నికల ఏర్పాట్లను నిలిపి వేయాలని స్టే ఇవ్వడంతో గ్రామాల్లో గురువారం సాయంత్రం నుంచి అశావవుల పలకరింపులు కరవు అయ్యాయి. గ్రామాల్లో సర్పంచిని అంటూ తిరిగిన అయ్యగారు పత్తకు లేరు. జిల్లాలో 545 సర్పంచ్ స్థానాలకు, 5022 వార్డులకు  రిజర్వేషన్లు ఖరారు కావడంతో  గ్రామాల్లో నేను అంటే నేను అన్నట్లుగా పోటీ చేయాలనుకున్న వారు బంధాలు, అనుబంధాలు అంటూ కలుపుకుపోయారు. అక్కడక్కడ రిజర్వేషన్లు తెలిసిన రోజు నుంచి మద్యం మత్తు ఎక్కింది. ఆశావాహులు మందుకు, మాంసంకు వేల రూపాయలను ఖర్చు చేశారు. నోటిఫికేషన్ రావడంతో ఎగిరి గంతు వేశారు. వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే కోర్టు నుంచి స్టే రావడంతో ఏంచేయాలో అర్థం కాకా తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఓటర్లను పలకరించే పలకరింపులు కరువయ్యాయి.

More articles

Latest article