నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు నగరంలోని కంటేశ్వర్ బై పాస్ చౌరస్తా లో గల అపోలో ఫార్మసీ గ్రౌండ్ ఫ్లోర్ లో మాన్యావార్ కాన్సీరామ్ వర్ధంతి కార్యక్రమం మాదిగ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గావాయి కి సుప్రీం కోర్ట్ లో జరిగిన అవమానం యావత్ దళిత జాతి కి జరిగిన అవమానంగా, భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా మనువాదులు దాడులు చేస్తున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడి చేసిన వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దళితులంతా ఏకమై భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మారుతి, రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్, గంగాధర్, తెడ్డు గంగారం, సురేష్, నాంపల్లి, ఉద్యోగ సంఘ సభ్యులు గంగాధర్, బాబు, రాజ నరేష్, మహేష్ ఆధ్వర్యంలో కాన్సీరామ్ కు నివాళులు ఆర్పించారు.

