28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లీయర్

Must read

📰 Generate e-Paper Clip

  • స్టే కోసం హైకోర్టు నిరాకరణ
  • 9న మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్

 

హైద్రాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లీయరైంది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే లోకల్ బాడి ఎన్నికల నిర్వహణకు హైకోర్టు స్టేకు నిరాకరించింది. బుధవారం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిలుపుదల చేయాలని దాఖలు చేసిన పిటిషనర్ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం  లైన్ క్లీయర్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొదటి దశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగనుంది. 2963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అధికారులు. ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. ఈ నెల 23న పోలింగ్, నవంబర్ 11న  కౌంటింగ్ జరుగనుంది.

  • బీసీ రిజర్వేషన్ లపై ఉత్కంఠ..

రాష్ట్ర హైకోర్టులో గురువారం బీసీ రిజర్వేషన్ లపై విచారణ జరుగనుంది. గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జారీ చేసిన గెజిట్ పై మాదవరెడ్డి, సముద్రాల రమేష్ అనే వ్యక్తులు హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెల్సిందే. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్.క`ష్ణయ్య, హనుమంతురావులు ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారణ జరిగింది. పిటిషన్ల తరపున న్యాయవాదులు 42 శాతం రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదని బీసీ కులగణన చేశారని, కానీ లెక్కలు బహిర్గతం చేయలేదని వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 2011 జనాభా ఆధారమని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా, తగ్గిందా అనే విషయం ప్రభుత్వం వద్ద లేదని ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ద ఎన్నికల నిర్వాహణకు తాము వ్యతిరేకం కాదని రాజ్యాంగ విరుద్దంగా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని, ఇప్పుడు జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరగా సరికాదన్నారు. బీసీ ప్రత్యేక డెడికెటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వ రిజర్వేషన్లను 50 శాతంకు మించి పెంచొచ్చని తెలిపారు. అయితే ఈ విషయంపై హైకోర్టు తన తీర్పును గురువారానికి వాయిదా వేసింది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగడం ఖాయమైంది. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ పై స్టే కు హైకోర్టు నిరాకరించడంతో రాష్ట్రంలో లోకల్ బాడి ఎలక్షన్ హడావుడి ప్రారంభం కానుంది. మూడు రోజుల్లోనే నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో రాజకీయ పార్టీలు సందడి నెలకొననుంది. ఇప్పటికి అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎన్నికలకు సంసిద్దం కాగా బీజేపీ కూడా ఎన్నికల గోదాలో నిలిచేందుకు సమాయత్తమైంది. బీఆర్ఎస్ పార్టీ కోర్టు నిర్ణయం కోసం ఆచితూచి వ్యవహరించిన ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మండల పరిషత్ , జిల్లా పరిషత్ ల గెలుపు కోసం అన్నీ పక్షాలు బుధవారం సాయంత్రం నుంచే సమాలోచనలు జరుపుతున్నాయి. అయితే గురువారం బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు రావడంతో రిజర్వేషన్ల అమలు పై సందిగ్ధం తొలగిపోనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ కోర్టు 42 శాతం బీసీ రిజర్వేషన్లను అంగీకరించకపోతే తమ పార్టీ తరపున బీసీలకే 42 శాతం టికెట్లు ఇచ్చేందుకు సిద్దమైంది. బీజేపీ, బీఆర్ఎస్ లు లోకల్ బాడి ఎలక్షన్ల ఏజండాకు సిద్దమౌతున్నారు.

More articles

Latest article