25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్), సిద్దాపూర్, రుద్రూర్ గ్రామాలలో  ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  బుధవారం తహశీల్దార్ తారాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా  కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైఖ్యా అధ్యక్షురాలు ద్రౌపతి, ఏపిఎం బస్వంతరావు, సీసీ గంగారాం, విఓఏ లావణ్య, స్వరూప, రైతులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article