బతుకమ్మ, భిక్కనూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్రం నుండి వచ్చిన పీకే రాయ్ బృందం బుధవారం పరిశీలించింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు పట్టణంలో దసనమ్మ కుంటను పరిశీలించి దాని అంచనా విలువ, పంట నష్టాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంతంపల్లి లో తెగిన రోడ్డు, పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన పంటలు దెబ్బతిన్న చెరువులు రోడ్లు నష్టం వివరాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాగ్వన్ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా వారికి వివరించారు.

