నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ కమిషనరేట్ పరిధి లో ఇద్దరు ఏఎస్సైలు ఎస్పైలుగా ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా వారిని పోలీసు కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. నిజామామాద్ టౌన్-3 లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్న బి. ఈశ్వర్ ఎస్సైగా ప్రమోషన్ పొంది ఆదిలాబాద్ జిల్లా కు వెళ్లారు. రెంజల్ పీఎస్ లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్న గంగా ప్రసాద్ ఎస్సైగా ప్రమోషన్ పొంది ఆదిలాబాద్ జిల్లా కు వెళ్లారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్సైలకుఎస్పైలుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని, ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ఏఎస్సైలకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేశారు.


