23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండు దగ్గు మందులను నిషేధించిన ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం రెండు దగ్గు మందులపై  నిషేధం విధించింది.  రీలైఫ్‌, రెస్పీఫ్రెష్‌-టీఆర్‌ దగ్గు మందులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  ఈరెండు ఫార్మా కంపెనీల మెడిసిన్స్ గుజరాత్ కు చెందినవి.  ఈ రెండు దగ్గు మందులను మెడికల్ షాపుల్లో  విక్రయించొద్దంటూ (డీసీఏ) డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్  ఉత్తర్వులు చేసింది.  ఈ రెండు దగ్గు మందుల్లోనూ కల్తీ జరిగినట్లు గుర్తించింది. కాగా, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ల్లో కోల్డ్ రీఫ్ దగ్గు మందు సేవించి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

More articles

Latest article