బాన్సువాడ, బతుకమ్మ : వరి ధాన్యం కొనుగోలు పై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలోని పీఏసీఎస్ కార్యదర్శిలు, సిబ్బంది, ట్యాబ్ ఆపరేటర్ లతో బాన్సువాడ సొసైటీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన కామారెడ్డి జిల్లా డిసిఓ రామ్మోహన్ రావ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2389 సాధన రకం ధాన్యానికి రూ. 2369 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టర్, క్లస్టర్ అధికారి కవిత, సీనియర్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, నాగరాజు, సాయినాథ్, సృజన్ , అలీమోద్దీన్, సొసైటీ కార్యదర్శులు జకీర్ హుస్సేన్, విట్ఠల్, శ్రీనివాస్, భూమయ్య, వెంకట్, మోహన్, ఆయా సొసైటీల కార్యదర్శులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.