- ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎరన్న
మోపాల్, బతుకమ్మ : మంచిప్ప 21 ప్యాకేజ్ పనులు పూర్తిచేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని 84 వేల ఎకరాలకు నీళ్ల అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎరన్న డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మోపాల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సెగ్మెంట్ కు నీళ్లు ఇచ్చేందుకుగాను మోపాల్ మండలంలోని మంచిప్ప ప్రాజెక్టు నీటిని 2623 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 21 ప్యాకేజ్ పనులు సకాలంలో పూర్తి కాలేదని అన్నారు. 2022లో వ్యయాన్ని రీవైజ్ చేస్తూ 3650 కోట్లు కు పెంచిన ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించలేదని, ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి మరొ 2000 వేల కోట్లు రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో 6 మండలాలలోని 77 గ్రామాలు, వాటి అనుబంధ తండాలకు 84 వేల ఎకరాలకు నీళ్లందుతాయని, దీనితోపాటు ఈ ప్రాంత చెరువులు, కుంటలు నింపవచ్చునని తెలిపారు. ఈ పనులు 50%వరకే పూర్తయినాయని, మిగతా పనులను టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన, రైతు రాజ్యం, రైతు నేస్తం అంటూ మాటలు మాట్లాడుతుంది కానీ చేతలలో చూపించడం లేదని అన్నారు. మధ్యలో అర్థంతరంగా ఆగిపోయిన 21 ప్యాకేజీ పనులకు తగిన నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. వెంటనే 2000 కోట్లు కేటాయించి పనులను పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ 21 ప్యాకేజీ పనులను పూర్తి చేయడానికి గాను ప్రభుత్వం వెంటనే రెండు వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలి. ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా ప్రభుత్వం జీవో విడుదల చేసి పనులు ప్రారంభించాలని ఏఐకేఎంఎస్ ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో అగ్గు చిన్నయ్య, కార్యదర్శి బండమిది నర్సయ్య, జిల్లా నాయకులు, జి.గంగాధర్, పీవైఎల్ నాయకులు, భూజేందర్ మండల నాయకులు, కట్లే గంగాధర్,గుడోల్ల సాయిలు,బి.మహేష్, తదితరులు పాల్గొన్నారు.
