- సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించండి
- సైబర్ మోసాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనది
- మార్చ్ నుండి సెప్టెంబర్ వరకు 33 కేసులు నమోదు
- పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సైబర్ మోసాల పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు అవగాహనతో అప్రమత్తలతో వ్యవహరించాలని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఒక ప్రకటనలో సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాదు జిల్లా పోలీసు సైబర్ కార్యాలయానికి గత నెల రోజులలో 8 ఫిర్యాదులు అందాయని అందులో ముఖ్యంగా సోషల్ మీడియా ఫ్రాడ్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ చలామణి మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటిపట్ల అప్రమత్తులతో వ్యవహరించాలని వాటిని నమ్మవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాల ఉచ్చులో పడ్డట్లయితే వారు 1930 ద్వారా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చని లేదా డయల్ 100 కు ఫోన్ చేయాలని లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ సంప్రదించాలని లేదా www.cybercrime.gov.in లాగిన్ అయి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆర్థికపరమైన నష్టాలు జరిగిన వెంటనే గ్రహించి గంటలోపు ఫిర్యాదు చేసిన యెడల జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కు సంప్రదించిన వారి అకౌంట్లో డబ్బులను ఆపి ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రతివారం నిజామాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ బృందంచే గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుత సమాజంలో జరుగుతున్న నేరాల పై చైతన్య పరచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్ను ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ ఫై విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా యువతను నిరుద్యోగ అవకాశాల పేరుతో సైబర్ క్రైమ్ బాధితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశ చూపి వారి ద్వారా డబ్బులను లూటీ చేయడం జరుగుతుందని దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాదు సి.సి.పి.యస్ యందు మార్చ్ 2025 నుండి సెప్టెంబర్ 2025 వరకు మొత్తం నమోదు అయ్యిన సైబర్ కేసుల సంఖ్య 33, కోల్పోయిన డబ్బులు మొత్తం రూ : 4,92,54,875-00 , వాటిల్లో రికవర్ చేయబడినవి రూ: 87,29,839-00 వివిద రకాలైన సైబర్ మోసాలు అనగా డిజిటల్ అరెస్ట్, బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, సైబర్ స్లేవ్వరీ బాధితులు మోసగింపబడ్డారని తెలిపారు.
- నిజామాబాదు జిల్లాలో నమోదైన పలు కేసుల వివరాలు..
నిజామాబాద్ లోని వినాయక్ నగర్ కి చెందిన వ్యక్తి బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ లో రూ.10,51,533 డబ్బులు కోల్పోతే, రూ.7,89,979 సి.సి.పి.యస్ నిజామాబాదు వారు రికవరీ చేశారు. ఆర్మూర్ డివిజన్ కి చెందిన ఒక వ్యక్తి బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ లో రూ.52,50,297 డబ్బులు కోల్పోతే, రూ.27,25,725 రికవరీ చేశారు. నిజామాబాదు కి చెందిన మరొక వ్యక్తి ని సైబర్ నెరగాళ్లు డిజిటల్ అరెస్ట్ ని బెదిరించి అతనియెక్క రూ : 30,81,000 (ఆర్.టి.జి.యస్ ట్రాన్సాక్షన్ ద్వారా లూటీ చేస్తే, రూ : 20,81,000/- సి.సి.పి.యస్ రికవరీ చేశారు.
నిజామాబాద్ సైబర్ క్రైమ్ బృందంలో సభ్యులుగా ఏసిపి వై.వెంకటేశ్వరరావు , ఇన్స్పెక్టర్ మహమ్మద్ ముఖిత్ పాషా, ఎస్సై ఎం.ప్రవళిక, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ శ్రీరామ్, సురేష్, నాగభూషణం, నరేష్, ప్రవీణ్, రాఘవేంద్ర, సుమలత, శృతి, రమ్య ఉన్నారు.
