27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ముగిసిన దేవీశరన్నవరాత్రులు

Must read

📰 Generate e-Paper Clip

  • అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ప్రారంభం
  • మాల విరమణ చేసిన భవానీ దీక్షపరులు

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ : దేవీశరన్నవరాత్రులు ఉత్సవాలు ముగిసాయి. గురవారం దసరా పండుగ వరకు దశవతరాలలో అమ్మవారు పూజలందుకున్నారు. సెప్టెంబర్ 21న దుర్గాదేవి మండపాలలో అమ్మవార్లను ప్రతిష్టించారు. పది రోజులుగా వివిధ రూపాలలో అమ్మవార్లను కొలుచుతున్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా దేవీ మండపాలు ఏర్పాటయ్యాయి. వేల మంది భవానీ దీక్షలు బూనారు. పది రోజులుగా పూజలందుకున్న అమ్మవార్ల  నిమజ్జనం శుక్రవారం జరుగాల్సి ఉండగా మూల నక్షత్రం కారణంగా శుక్రవారం సాయంత్రం చాలా చోట్ల అమ్మవార్ల విగ్రహాలను కదిపి శోభయాత్రకు సిద్దమయ్యారు. పలు ప్రాంతాల్లో నిమజ్జనం జరిగింది. చాలా మట్టుకు శనివారం నిమజ్జనం ఏర్పాట్లను చేశారు. 11వ రోజు రాజేశ్వరిదేవిగా చాలా ప్రాంతాల్లో కొలుచుకున్నారు. భవానీ దీక్ష ముగింపు కోసం చాలా మంది మండపాలలోనే మాల విరమణ చేశారు. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల ముగింపునకు ప్రధాన ఘట్టమైన శోభయాత్ర నిమజ్జనాలు గోదావరి క్షేత్రంలో చేసేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. బాసర, ఉమ్మెడ వద్ద, త్రివేణి సంగమం కందకుర్తి వద్ద, తడ్ పాకల్ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

More articles

Latest article