27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వరద కాలువకు నీటి నిలుపుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ : శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువకు నీటి విడుదల నిలిపివేసినట్లు ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 2,72,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు 39 గేట్లు నెత్తి 1, 92,000 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 4000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు లక్ష్మి కాలువ ద్వారా 200  క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం ప్రాజెక్టులో 1089.60 అడుగులు, 75.314 టిఎంసిల నీరు నిల్వ ఉంది.

More articles

Latest article