బతుకమ్మ,బాల్కొండ : బాల్కొండ మండలం వన్నెల్ (బీ) గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన కొత్తింటి ముత్యం రెడ్డి, డైరెక్టర్ పబ్బ రాజేష్ ను( వన్నెల్ – బీ) కాంగ్రెస్ కార్యకర్తలు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ నాగులపల్లి కిషన్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఎల్లన్న గారి చిన్న దేవేందర్, గోజుర్ సంతోష్ ,పర్షపు రఘుపతి రాజ్ పాల్,గాదేపల్లి రాజేందర్, బుర్ర రాజేందర్ ,లింబాద్రి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
