రిజర్వేషన్లను రక్షించే ఏకైక వ్యక్తి మోదీ

0 1,026

. . .ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గోనే గంగారం వ్యాఖ్యలు

బతుకమ్మ: బిచ్కుంద 

కాంగ్రెస్‌ పార్టీ దళిత వ్యతిరేకి అని, ఎంతోమంది దళిత నేతలను  అవమానించిందని ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు గోనే గంగారం ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంత వరకూ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌కు భారతరత్నా ఇవ్వలేదని పేర్కొన్నారు. తాము ఆయనను గౌరవించేందుకు పంచతీర్థాన్ని స్థాపించామని, సంవిధాన్‌ దివాస్‌ ప్రకటించామని తెలిపారు. మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న గోనే గంగారం కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లపై ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.’ అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదని రాహుల్‌ గాంధీ అమెరికాలో మాట్లాడారు. వారి (కాంగ్రెస్‌) అభివృద్ధి తర్వాత రిజర్వేషన్లను ఎత్తివేస్తారు. ఎస్సీ, ఓబీసీ రిజర్వేషన్లను రక్షించగల వ్యక్తి ఎవరైనా ఉంటే అది ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే’ అని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొన్ని గంగారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణాతారా, బిజెపి మండల అధ్యక్షుడు మల్లికార్జున దేశాయ్, బిజెపి సీనియర్ నాయకులు జుట్టు సాయిలు, అవులే రాహుల్ , ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.