30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

మోగిన స్థానిక ఎన్నికల నగారా

Must read

📰 Generate e-Paper Clip

  • అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్
  • అక్టోబర్ 23, 27 తేదిల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదిల్లో పంచాయతీ ఎన్నికలు
  • అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

 

హైదరాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నిర్వాహణకు సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి కుముదిని అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు అయిందని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాలో 565 మండలాల్లో రెండు విడతల్లో 5749 మందికి ఎంపీటీసీ స్థానాలకు, 656 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 23, 27 తేదిల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదిల్లో మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా కోసం అధికార యంత్రాంగం ఇది వరకే సిద్దపడిన విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా ఖరారు తర్వాత ఈ నెల 27వ తేదిన రిజర్వేషన్లను ప్రకటించారు. 31 జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుతో పాటు మహిళలకు సగానికి పైగా సీట్లను కేటాయిస్తూ ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 27న స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల వాయిదా వేయవచ్చని న్యాయస్థానం ఆదేశించినా నోటిఫికేషన్ వెలువడడం విశేషం. అక్టోబర్ 8న రిజర్వేషన్లపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. అయితే ఎన్నికలు మాత్రం యదావిధిగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది.

More articles

Latest article