నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం ఆయన్ను పలు పార్టీల నేతలు పరామర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి , మాజీ మంత్రి మండవవెంకటేశ్వర్ రావు, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ , రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ , తెలంగాణ విత్తనాల అభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నగేష్ రెడ్డి భూపతి రెడ్డి పరామర్శించారు. అనంతరం లక్ష్మీ నర్సమ్మ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


