26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కేకే అండతో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్

Must read

📰 Generate e-Paper Clip

సిరిసిల్ల జిల్లా, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట మండల కేంద్రంలోని హనుమాన్ నగర్, సీతారాం బజార్, బ్రాహ్మణ వీధిలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కి ఆదేశించి జడ్పీ నిధులతో నాలుగు లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేసి మూడు కొత్త బోర్లను వేసి మోటార్లను బిగించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ గంభీరావుపేట మండల కేంద్రాన్ని గత రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను తీసుకురావడంలో గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ లేకుండా అధికారులతో నాయకులతో మమేకమై గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచడంతో పాటు సంక్షేమ పథకాలను కూడా ప్రతి గడపకు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని, ముఖ్యంగా ఎక్కడ నీటి ఇబ్బంది ఉన్న సకాలంలో స్పందించి వాటిని పరిష్కరించేటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుంటామని తెలిపారు.ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి మరింత అభివృద్ధి కోసం తోడ్పాటును అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏడవైన ప్రభాకర్,మాజీ సర్పంచ్ అక్క పెళ్లి బాలయ్య,నాయకులు పెద్దవేని రాజ మల్లయ్య, బంగ్లా రాజు, ఎగదండి మహేష్ ,శనిగరపు శంకర్ , ఆశయ్యగారి రమేష్, నాంపల్లి ,ప్రసాద్ ,చంద్రశేఖర్ గౌడ్ పిట్ల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article