నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ రేకుల పల్లి భూపతి రెడ్డి కి మాతృ వియోగం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే మాతృ మూర్తి రేకుల పల్లి లక్ష్మి నర్సమ్మ (93) సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో ఎమ్మెల్యే నివాసంలోనే పరమ పదించారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం రాజారెడ్డి, లక్ష్మి నర్సమ్మలకు ఏడుగురు సంతానం. అందులో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చివరి వారు. భూపతిరెడ్డి తండ్రి రాజారెడ్డి 1994 లో చనిపోయారు. వృద్దాప్య సమస్యలు అనారోగ్యం కారణంగా లక్ష్మీ నర్సమ్మ గతకొంత కాలంగా భూపతి రెడ్డి నివాసంలోనే చికిత్స పొందుతుండగా చనిపోయారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గూపన్ పల్లి వైకుంఠధామంలో లక్ష్మి నర్సమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిసింది.
