రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మాతృ వియోగం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ రేకుల పల్లి భూపతి రెడ్డి కి మాతృ వియోగం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే  మాతృ మూర్తి రేకుల పల్లి లక్ష్మి నర్సమ్మ (93) సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో  ఎమ్మెల్యే నివాసంలోనే  పరమ పదించారు. నిజామాబాద్ రూరల్ మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం రాజారెడ్డి, లక్ష్మి నర్సమ్మలకు ఏడుగురు సంతానం. అందులో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చివరి వారు. భూపతిరెడ్డి తండ్రి రాజారెడ్డి  1994 లో...