26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బిచ్కుంద పాత బస్టాండ్లో కోకల డబ్బులు ఎక్కడ..?

Must read

📰 Generate e-Paper Clip

  • అనుమతుల పేరిట రూ.10వేలు అడ్వాన్స్ వసూలు
  • ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో ఉపాధి కోల్పోతున్న లబ్ధిదారులు

 

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ స్థలంలో గత 8 సంవత్సరాల క్రితం కోకలు వేసుకొని వ్యాపారం చేసుకొనుటకు సుమారు 80 మంది లబ్ధిదారులకు అవకాశం కల్పించి వారి వద్ద నుండి అడ్వాన్స్ రూపేనా సుమారు ఎనిమిది వేల రూపాయల నుండి పదివేల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులను ఇప్పటివరకు పంచాయతీ ఖాతాలో జమ చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో ఇచ్చిన అడ్వాన్స్ రూపాయలు లబ్ధిదారులకు తిరిగి ఇస్తారా? లేదా మొండి చేయి చూపిస్తారా? అంటూ పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు. అడ్వాన్స్ రూపాయలు 80 కోకలకు (దుకాణదారులు) పైగానే అడ్వాన్స్ రూపాయలు చెల్లించినందున తిరిగి తమ డబ్బులను వాపస్ చేయాలని బాధితులు కోరుతున్నారు.

More articles

Latest article