- దుర్గామాత సన్నిధిలో వేద పండితుల మధ్య చండీ యాగం
డొంకేశ్వర్, బతుకమ్మ : డొంకేశ్వర్ మండల కేంద్రంలో శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గమాత సన్నిధిలో ఐదుగురు వేద పండితుల మధ్య చండీ యాగాన్ని సోమవారం నిర్వహించనున్నారు. మండలంలోని వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో ఈ చండీయాగంలో పాల్గొని శ్రీ దుర్గా మాత ఆశీస్సులు పొందాలని శ్రీమాన్ పాండురంగా ఆచార్యులు పాంచరాత్ర ఆగమ పండితులు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు మాలాధారణ ధరించి భక్తి శక్తులతో దుర్గామాతను ఆరాధిస్తున్నారని వారు తెలిపారు. చండీయాగంలో యజ్ఞ యాగాలతో పాటలు,ఆటలతో, అభిషేకాలతో పూజలు నిర్వహించనున్నారు. మండలంలోని భక్తులందరూ మొక్కులు తీర్చుకొని మహా అన్నదాన సత్రాన్ని విజయవంతం చెయ్యగలరని వివిధ గ్రామ ప్రజలు, భక్తులు,అమ్మవారి మాల భక్తులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
